అమరావతి రాజధాని పనులతో పాటు రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటిలో రూ.49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాజధాని అమరావతిలో చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.అమరావతి అంటే ఒక నగరం కాదు.. ఒక శక్తి.. ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ అదరగొట్టారు. ఆంధ్రా ప్రజలను కలవడం ఆనందంగా ఉందన్న ఆయన.. పలు కీలక అంశాలను తెలుగులోనే చెప్పారు.
అమరావతి రాజధాని పనులతో పాటు రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటిలో రూ.49,040 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రాజధాని అమరావతిలో చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. అమరావతితో ఒక గొప్ప స్వప్నం సాకారమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇంద్రలోక రాజధాని పేరు అమరావతి. అదే పేరుతో ఇప్పుడు ఏపీ రాజధాని నిర్మాణం జరుగుతోందని, అమరావతితో ప్రతి ఆంధ్రుడి స్వప్నం నెరవేరుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ కలలుకన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఏపీకి పట్టిన గ్రహణం వీడిందన్నారు ప్రధాని మోదీ. ఏపీలో అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతోందన్నారు. తనతో పాటు చంద్రబాబు, పవన్ వికసిత్ ఏపీ కోసం కృషిచేస్తామన్నారు.
కేంద్రంలో బలమైన నాయకుడిగా ఉంటూ గత పదకొండేళ్ళుగా ఒంటి చేత్తో భారత్ లాంటి సువిశాల దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా వరాల జల్లులు కురిపిస్తారు. మరీ ముఖ్యంగా సొంత పార్టీ అధికారంలో ఉన్న చోట అయితే ఆయన చేతికి ఎముక లేనట్లుగా వ్యవహరిస్తారు. అటువంటి మోడీ ఏపీకి వస్తే ఏమి ఇచ్చారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది.ఇక అమరావతి రాజధాని పనులు పునర్ ప్రారంభానికి ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. ఆయన వచ్చి దానిని పూర్తి చేశారు. అయితే ఇక్కడే అనేక పోలికలు ఫ్లాష్ బ్యాక్ కధలూ గుర్తుకు వస్తున్నాయి. 2015లో మోడీ అమరావతి రాజధానికి శంకుస్థాపనకు వచ్చినపుడు మట్టితో పాటు నీరు తెచ్చారు. ఆయన ఏ పవిత్ర ఉద్దేశ్యంతో తెచ్చినా అది కాస్తా భారీ విమర్శలకు గురి అయింది. అమరావతికి ఏదో ఇస్తారని ఎంతో మేలు చేస్తారని చూస్తే ఇదేనా ఇవ్వడం అన్నది అంతా విమర్శల రూపంలో చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరి దానిని గుర్తు చేసుకుని ఈసారి మోడీ జాగ్రత్తపడి ఉంటారని కీలక ప్రకటనలు చేస్తారని అంతా అనుకున్నారు. అయితే మోడీ జాగ్రత్తపడ్డారని అంటున్నారు. అదేంటి అంటే మట్టి నీరు తేకుండా అని సెటైర్లు వేస్తున్నారు. ఎందుకొచ్చిన తంటా అని ఆయన అనుకున్నారో లేక రెండోసారి శ్రీకారం చుడుతున్నాం కదా అని అవసరం లేదని అనుకున్నారో తెలియదు కానీ మామూలుగానే వచ్చి లక్షల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన అరగంటకు పైగా చేసిన ప్రసంగంలో ఎక్కడా కొత్త ప్రకటనలు అయితే లేఅవు. కీలకమైన అంశాల మీద వరాలూ లేవు. పదేళ్ళలో ఏపీకి ఎంత చేసింది సోదాహరణంగా చెప్పారు. అమరావతిని దీవించారు. మూడేళ్ళలో తప్పకుండా ఏపీ కలలు సాకారం అవుతాయని నమ్మకంగా చెబుతూ తన ప్రసంగం ముగించారు.
దాంతోనే మళ్ళీ ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు. ఈసారి కూడా మోడీ నిరాశ పరచారు అని అంటున్నారు. సోషల్ మీడియాలో అయితే మోడీ ఏమీ ఏపీకి వరాలు ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నారు. అయితే మోడీ ఏమి చేసినా లేక ఏమి ఇచ్చినా కూడా అది బహిరంగ సభలలో చెప్పరని పాలసీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్స్ పెట్టి వాటిని ప్రకటిస్తుందని గుర్తు చేస్తున్నారు. ఇక అమరావతికి సంబంధించి ఆర్ధిక వనరులు సమకూర్చడం వెనక మోడీ ప్రభుత్వం అండదండలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా కేంద్రం భుజం కలిపి ఏపీ అభివృద్ధి కోసం పనిచేస్తుందని మోడీ హామీ ఇచ్చారు కదా అని ఆ పార్టీ వారు అంటున్నారు ఇక మోడీ నోటి నుంచి అమరావతి రాజధాని అన్న మాటను అయితే భూములు ఇచ్చిన రైతులు వినగలిగారు. కానీ అదే సమయంలో పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేసి ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పలేదన్న నిరాశ వాళ్ళలోనూ ఉంది అంటున్నారు.
అయితే దీని మీద కూటమి నుంచి వస్తున్న స్పందన ఏంటి అంటే గెజిట్ నోటిఫికేషన్ తప్పకుండా వస్తుందని ఇదంతా పరిపాలనకు సంబంధించిన అంశాలని వాటిని బహిరంగంగా ఎవరూ ప్రకటించరని అంటున్నారు. అమరావతికి మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దన్నుగా ఉందని ఇంతకంటే వేరే ప్రకటనలు ఎందుకు అని కూటమి నాయకులు అంటున్నారు. మొత్తానికి మోడీ అమరావతికి మళ్ళీ వచ్చారు. ఈసారీ సారీ అనిపించారా ఉసూరనిపించారా అంటే ఎవరి మాటలు వారివి ఎవరి వ్యాఖ్యానాలు వారివి అని అంటున్నారు.
ఏపీలో రాజకీయం మారిపోయిందని కూటమి పట్ల వ్యతిరేకత వచ్చిందని తరచూ వైసీపీ అంటోంది. అంతే కాదు ఎపుడు ఎన్నికలు వచ్చినా తమదే విజయమని చెబుతోంది. అయితే వైసీపీ ఏ రకమైన అంచనాలు వేసుకుని ఈ విధంగా ధీమా పెంచుకుంటుందో తెలియదు కానీ ఏపీలో టీడీపీ కూటమి వెరీ స్ట్రాంగ్ గా ఉంది అని అంటున్నారుఅమరావతిలో రాజధాని పనుల పునర్ నిర్మాణ కార్యక్రమంలో అది మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురూ త్రిమూర్తులు మాదిరిగా కూటమికి సారథ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురికీ వ్యక్తిగతంగా బ్రహ్మాండమైన ఇమేజ్ ఎవరికి వారికి ఉంది. అలాగే ముగ్గురికీ అభివృద్ధి మీద తపన ఉంది. ఒక విజన్ ఉంది.
రాజకీయాలకు అతీతంగా ఏపీని డెవలప్ చేయాలన్న కోరిక ఉంది. అది జనాలకు కూడా నచ్చుతోంది. అందుకే 2014, 2024లలో ఈ కాంబోని గెలిపించారు. దానికి తగినట్లుగానే అభివృద్ధిని కూడా ఈ ముగ్గురూ చూపిస్తున్నారు. పైగా జాతీయ స్థాయిలో తిరుగులేని స్థితిలో నరేంద్ర మోడీ ఉన్నారు. బలమైన రాజకీయ పక్షంగా బీజేపీ ఉంది. వ్యూహాలలో మోడీ దిట్ట. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సైతం విజనరీ మాత్రమే కాదు అపర చాణక్యుడు. ఎక్కడికి ఏది అవసరమో ముందే అంచనా కట్టి దాని ప్రకారం చేసుకుని పోవడంలో బాబుకు సాటి ఎవరూ లేరు. పవన్ జనాకర్షణ శక్తి కానీ ఆయన వెనక ఉన్న బలమైన సామాజిక వర్గం కానీ చూస్తే ఆయన రాజకీయ ఈక్వేషన్స్ ఎంత పవర్ ఫుల్ అన్నది అర్థం అవుతుంది.
మరి ఈ ముగ్గురూ కలసికట్టుగా ఉంటే ఓడించడం కష్టం అన్నది కూడా ఒక విశ్లేషణ. అంతే కాదు జనాలకు కూడా ఈ కాంబో బాగా నచ్చేదిగా ఉంది. మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని జనవరిలో విశాఖలో జరిగిన సభలో నిరూపించిన ఈ నాయక త్రయం ఇపుడు అమరావతిలోనూ దానికే కొనసాగించారు. ఇంతలా పెనవేసుకుని పోయిన ఈ రాజకీయ బంధాన్ని విడదీయడం ఎవరి వల్లా కాదనే అంటున్నారు. దానికి కారణం మోడీకి దక్షిణాదిన రాజకీయంగా ఏపీ ముఖ్యమైనది. ఆయన టీడీపీ జనసేనలతో కోరి వేరు చేసుకునే పరిస్థితి తెచ్చుకోరు ఆ మాటకు వస్తే 2018లోనూ బీజేపీ టీడీపీని వెళ్ళిపొమ్మనలేదు. ఇక బాబు కూడా గతానుభవాలను గుర్తుకు తెచ్చుకుని బీజేపీ వంటి బలమైన పార్టీతో మోడీ వంటి పవర్ ఫుల్ లీడర్ తో స్నేహాన్ని కంటిన్యూ చేయడానికే చూస్తున్నారు.
Our Governments, at the Centre and in AP are working extensively to improve the lives of farmers. pic.twitter.com/JFO12oCcET
— Narendra Modi (@narendramodi) May 2, 2025
పవన్ కి బాబు అన్న మోడీ అన్నా ఒక రకమైన ఆరాధన భావం ఉంది. ఈ ఇద్దరి వల్లనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఆయన బలంగా నమ్ముతారు. ఇక రాజకీయం కోసమో మరో దానికో ఆయన కోరి పొత్తులను చిత్తు చేసుకునే నైజం కాదు. ఈ విధంగా ముగ్గురు నేతలూ పట్టుబట్టి కలసికట్టుగా ఉంటే ఈ కూటమిని బద్దలు కొట్టే సాహసం కానీ ఆ బలం కానీ ఎవరికి ఉంది అని అంటున్నారు. ఏపీకి కేంద్ర సాయం కావాలి. అలాగే అభివృద్ధి కావాలి. ఇది సగటు ఆంధ్రుల ఆలోచన. ఇపుడు ఆ విధంగా అంతా కలసి పనిచేస్తూంటే కాదనుకుని ఒంటరిగా ఉంటూ ఎవరి సాయం లేకుండా ఏపీని ఏలుతామని చెప్పే వైసీపీని ఎన్నుకునేందుకు జనాలు మొగ్గు చూపుతారా అన్నదే పెద్ద ప్రశ్న. సో ఏపీలో కూటమి వెరీ స్ట్రాంగ్ అన్నది వాస్తవం.
ఏపీ రాజధాని అమరావతిని పున: ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రావటం.. పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టటం.. బహిరంగ సభలో మాట్లాడటం తెలిసిందే. ఈ వేదిక మీదకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావటానికి ముందు.. వచ్చిన తర్వాత.. వేదిక మీద నుంచి నిష్క్రమించే సమయంలోనూ ఆసక్తికర సన్నివేశాలకు కొదవ లేదు. అదే కదా మోడీ మేజిక్ అంటే. అన్నింటిలోనూ అందరిని విపరీతంగా ఆకర్షించటమే కాదు.. ఆ తర్వాత కూడా లోతైన చర్చకు తెర తీసిన ఉదంతం మాత్రం ఒక్కటే ఒక్కటి ఉంది.
జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలవటం.. ఆ విషయాన్ని పవన్ మొదట గమనించలేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కలుగజేసుకొని పవన్ ను రమ్మంటున్నారని చేతితో సైగ చేశారు.ఏదో ముఖ్యమైన విషయం చెప్పటానికి పిలిచారని భావించిన పవన్ స్పందించి పరుగున ఆయన వద్దకు చేరుకోవటం.. ఆయన తన చేతిలో ఉన్న చాక్లెట్ లాంటిది ఇచ్చారు. దీంతో ఆయన ఆశ్చర్య పోయి.. ఆ వెంటనే ఆనందానికి గురి కావటం కనిపించింది. ఇంతకూ పవన్ కల్యాణ్ చేతికి ప్రధాని మోడీ ఇచ్చింది కాఫ్లెట్. హిమాలయ కంపెనీకి చెందినది. పవన్ ను అంత కేరింగ్ గా చూసుకున్న మోడీ తీరుకు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఎక్స్ ప్రెషన్ అందరిని ఆకట్టుకుంది.
మొత్తం ఎపిసోడ్ కు ముందు ఒక ఘటన జరిగింది. అదేమంటే.. పవన్ తన స్పీచ్ ఇస్తున్న వేళలో పవన్ మూడుసార్లు దగ్గారు. గొంతు ఎండిపోవటం.. గొంతు ఇబ్బందిగా ఉందన్న విషయాన్ని గుర్తించిన ప్రధాని మోడీ.. పవన్ ను పిలిచి మరీ కాఫ్లెట్ ఇవ్వటం ద్వారా.. జనసేనాని విషయంలో ప్రధాని మోడీ ఎంత కేరింగ్ ఉంటారో మరోసారి అర్థమవుతుంది. తాజా ఉదంతంతో మిగిలిన నేతలకు భిన్నంగా పవన్ తనకు స్పెషల్ అన్న విషయాన్ని ప్రధాని చేతలతో చెప్పేశారని చెప్పాలి.
ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షాలకు కొదవ లేదు. జనసేన అధినేత పవన్ విషయంలో ప్రధాని మోడీ ప్రదర్శించే అప్యాయత.. మరే ఇతర పార్టీ అధినేత విషయంలోనూ కనిపించదని చెబుతారు. చివరకు సొంత పార్టీకి చెందిన నేతలతోనూ ఆయన ఈ తరహా ధోరణిని ప్రదర్శించరని చెబుతారు. మిగిలిన అధినేతలకు పవన్ కు వ్యత్యాసం ఉందన్న విషయంతో పాటు.. అతను తన మనసుకు ఎంత దగ్గరన్న విషయాన్ని ప్రధాని దాచుకునే ప్రయత్నం చేయరు. మొత్తంగా చూస్తే.. పవన్ తన ఇంట్లో వ్యక్తిగా భావిస్తారన్న భావన కలిగేలా కాఫ్లెట్ ఇచ్చిన ఉదంతం స్పష్టం చేసిందని చెబుతున్నారు
Our Governments, at the Centre and in AP are working extensively to improve the lives of farmers. pic.twitter.com/JFO12oCcET
— Narendra Modi (@narendramodi) May 2, 2025