మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియాకు గ్లామర్ డాళ్ పాత్రలు కొత్తేమీ కాదు. అందంతో కవ్వించడం, డ్యాన్సులతో గుబులు పెంచడం వెన్నతో పెట్టిన విద్య. అల్ట్రా గ్లామరస్ పాత్రల్లో తమన్నా ఇప్పటికే నటించేసింది. అయితే ఏక్తా కపూర్ బ్రాండ్ నాయికలతో పోలిస్తే, తమన్నా ప్రదర్శించింది చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఏదీ దాగదు. తమన్నా శరీరంలోని అణువణువును అందంగా తెరపరిచేసేందుకు ఏక్తా కపూర్ ఒక చక్కని ప్లాన్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మిల్కీ వైట్ అందాన్ని తనదైన ఏరోటిక్ హారర్ జానర్‌లో ప్రెజెంట్ చేసేందుకు ఏక్తా సిద్ధమవుతోంది.
అన్నీ అనుకూలిస్తే తమన్నాను బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ `రాగిణి ఎంఎంఎస్ 3`లో వీక్షించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం నిర్మాత ఏక్తాకపూర్- తమన్నా మధ్య చర్చలు సాగుతున్నాయి. తమన్నా బౌండ్ స్క్రిప్ట్ విని, సంతకం చేసేందుకు చేరువగా ఉందని కథనాలొస్తున్నాయి. రాగిణి ఎంఎంఎస్ జానర్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులో నటించిన కథానాయికలందరికీ మంచి పేరొచ్చింది. చివరిగా రాగిణి ఎంఎంఎస్ 2లో సన్నీడియోల్ లాంటి శృంగార నాయిక రెచ్చిపోయి నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయం సాధించడంలో బేబి డాళ్ సాంగ్, అందులో సన్నీ పెర్ఫామెన్స్ కూడా పెద్ద సాయమైంది. సన్నీలియోన్ అందాల ప్రదర్శన, ఘాటైన శృంగారం, హారర్ ప్రతిదీ ఈ సినిమా విజయానికి కారణమయ్యాయి. ఇప్పుడు ఎరోటిక్ హారర్ శైలిలో తమన్నా ఏమేరకు మెప్పిస్తుంది? అన్నది వేచి చూడాలి. ఒకవేళ తమన్నా ఎంపిక నిజమైతే అది రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంఛైజీని మరో లెవల్ కి తీసుకెళుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తమన్నా అందచందాలు, స్టార్ పవర్ ఈ సినిమాకి ప్రధాన బలంగా మారతాయి. మిల్కీ వైట్ బామకు కూడా ఇది కెరీర్ పరంగా మరింత అదనపు బూస్ట్‌నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.