అల్లు ఫ్యామిలీలో కొత్త మెంబర్ యాడ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ అయ్యిందన్న వార్త వచ్చింది. ఐతే ఆమె ఎవరన్నది ఇంకా రివీల్ చేయలేదు. ఐతే అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో అల్లు శిరీష్ పక్కన ఉన్న అమ్మాయి అతని ఫియాన్సీ అనే అంటున్నారు. అల్లు ఫ్యామిలీ మొత్తం ఈ పండగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
అల్లు ఫ్యామిలీలో అల్లు బాబీ అతని ఫ్యామిలీ అల్లు అర్జున్ దంపతులు వారితో పాటు అల్లు శిరీష్ తన ఫియాన్సీతో కలిసి ఇంటి పెద్ద అల్లు అరవింద్ దంపతులతో కలిసి ఫ్యామిలీ మొత్తం ఫోటో దిగారు. అల్లు శిరీష్ సినీ కెరీర్ కాస్త ఇబ్బంది కరంగానే ఉంది. అల్లు అరవింద్ లాంటి సపోర్ట్ ఉన్నా కూడా హీరోగా అతను నిలబడలేకపోతున్నాడు. తన వరకు ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎందుకో సక్సెస్ అవ్వట్లేదు.
ఇక కొంతమందికి పెళ్లైతే కెరీర్ లో లక్ కలిసి వస్తుంది. అలానే అల్లు శిరీష్ కి కూడా పెళ్లితో లక్ కలిసొస్తుందేమో చూడాలి. అల్లు ఫ్యామిలీలో అల్లు శిరీష్ మ్యారేజ్ తో అల్లు అరవింద్ బాధ్యత కూడా తీరుతుంది. ఐతే కెరీర్ లో అతను సెట్ రైట్ అవ్వడం మిగిలి ఉంది. ఐతే అల్లు శిరీష్ ఓ ఇంటి వాడు అవుతున్నాడు కాబట్టి ఆమె లక్ ఏమైనా కలిసి వస్తుందేమో చూడాలి.
అల్లు ఫ్యామిలీ దీపావళి వేడుకల్లో అల్లు శిరీష్ పక్కన ఉన్న అమ్మాయి అతని ఫియాన్సీనే అంటూ సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. ఇంతకీ ఆమె ఎవరు.. ఆమె పూర్తి డీటైల్స్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఐతే అల్లు శిరీష్ తన సినీ ప్రయత్నాల్లో ఈసారి అడుగు స్పెషల్ గా ఉండాలని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.
మెగా ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థలో భారీ సినిమాలు చేస్తూ నిర్మాతగా అదరగొడుతూ వస్తున్నారు. ఇక తండ్రి నిర్మాత అయినా కూడా తన కష్టాన్నే నమ్ముకుని అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ గా నిలిచాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ క్రేజ్ ఏంటన్నది ప్రూవ్ అయ్యింది. అల్లు బాబీ మాత్రం తన బిజినెస్ లు చూసుకుంటూ సినిమా నిర్మాణంలో ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక పెళ్లి తర్వాత అల్లు శిరీష్ కూడా కెరీర్ మీద మరింత ఫోకస్ చేయాలని చూస్తున్నాడు.