పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో తన క్రేజ్ ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు బన్నీ. ఏ ముహూర్తాన వీరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిందో కానీ అప్పట్నుంచి ఈ మూవీకి సంబంధించిన ప్రతీ చిన్న వార్తా చాలా పెద్ద సెన్సేషన్ గా నిలుస్తోంది.
పుష్ప2 తర్వాత బన్నీ చేస్తున్న సినిమా, జవాన్ తర్వాత అట్లీ నుంచి వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను అట్లీ చాలా స్పెషల్ గా ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్- అట్లీ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి రోజూ ఏదొక వార్త ఈ మూవీ గురించి చక్కర్లు కొడుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ముంబైలోని మెహబూబా స్టూడియోస్‌లో స్పెషల్ గా వేసిన సెట్ లో అల్లు అర్జున్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారని, ఈ సినిమాలో బన్నీ రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నారని, అందులో ఒకటి చాలా యంగ్ క్యారెక్టర్ అని, ఇంట్రో సీన్స్ ను గ్రీన్ మ్యాట్ లో షూటి చేస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్ తో సైన్స్‌ఫిక్షన్ సినిమాగా అట్లీ దీన్ని తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ఈ మూవీ కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉందని అంటున్నారు. హాలీవుడ్ కు చెందిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఈ మూవీ కోసం రంగంలోకి దిగగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొణె నటించనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. దీపికా కాకుండా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక, భాగ్య శ్రీ పేర్లు కూడా ఈ సినిమాలో నటించే హీరోయిన్ల పేర్ల లిస్ట్ లో వినిపిస్తున్నాయి.