స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తనదైన నటన, డ్యాన్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమా అనంతరం పుష్ప-2 సినిమాను తీయగా అది కూడా భారీగా కలెక్షన్లను రాబట్టింది. తన కెరీర్ లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా పుష్ప-2 చిత్రం నిలిచింది.
ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులే అయినప్పటికీ అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎలాంటి సినిమా షూటింగ్ లలో పాల్గొనడం లేదు. కానీ రెండు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లితో కలిసి “AA 22” అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను కూడా రీసెంట్ గానే జరిపారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించబోయే సినిమాలో కీలకపాత్రను పోషించనున్నారట. అమీర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించనున్నట్టుగా రీసెంట్ గానే అనౌన్స్ చేశారు.
రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో మహాభారతాన్ని ఐదు లేదా ఆరు పార్ట్ లుగా రూపొందించనున్నారు. ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో అల్లు అర్జున్ ను నటించమని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సంప్రదింపులు జరిపినట్టుగా చర్చలు కొనసాగుతున్నాయి. అట్లీతో చేసే సినిమా పనుల కోసం అల్లు అర్జున్ ఇటీవలే ముంబైకి వెళ్ళాడు. ఆ సమయంలో అమీర్ ఖాన్ కలిసి అల్లు అర్జున్ ను అర్జునుడి పాత్రలో నటించమని కోరినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి అల్లు అర్జున్ ఓకే చెప్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక శ్రీకృష్ణుడిగా అమీర్ ఖాన్ నటిస్తారని గతంలో ఆయన సందర్భంలో వెల్లడించాడు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.