ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో సంచలన విజయాలను నమోదు చేసాడు. పుష్పరాజ్ పాత్రతో ప్రపంచానికి సులువుగా కనెక్టయిపోయాడు. గంధపు చెక్కల స్మగ్లర్ గా అద్భుత నటనకు గాను అతడిని జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది. ఇప్పుడు అతడి స్టార్ డమ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లేందుకు మాస్ డైరెక్టర్ అట్లీతో కలిసి భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో నెవ్వర్ బిఫోర్ అనిపించే ట్రీట్ ఇచ్చేందుకు బన్ని-అట్లీ జోడీ రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం బన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను పలకరించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. అమెరికా, యూకే, న్యూజిలాండ్ సహా చాలా దేశాలలో ఉన్న తన అభిమానులకు అతడు నిరంతరం టచ్ లో ఉన్నాడు. ఇప్పుడు అమెరికా ఫ్లోరిడాలో నాట్స్ ప్రముఖులు, అభిమానుల ముందు అతడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు ఫ్లోరిడా-తంపాకు చేరుకున్న ఐకాన్ స్టార్ కి హృదయపూర్వకంగా నాట్స్ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రి జరిగే ప్రతిష్టాత్మక NATS 2025 కార్యక్రమానికి అల్లూ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
భారతదేశంలో ఓవర్సీస్ నుంచి 100 కోట్లు సునాయాసంగా వసూలు చేయగల హీరోల్లో ఇప్పుడు అల్లు అర్జున్ ఒకరు. అమెరికా సహా విదేశాల నుంచి అతడి సినిమాలకు భారీ వసూళ్లు దక్కుతున్నాయి. ఇప్పుడిలా ఈవెంట్ల పేరుతో విదేశాల్లోని అభిమానులకు బన్ని మరింత దగ్గరవుతున్నాడు. ఇది అతడి భవిష్యత్ సినిమాలకు బాగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 2025 ఉత్సవాల్లో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాడు.