భారతీయ సినీపరిశ్రమలో మేటి ప్రతిభావనిగా నిరూపించుకుని, వ్యక్తిగతంగా ఫ్యామిలీ లైఫ్ లోను సంపూర్ణ ఆనందాన్ని ఆస్వాధిస్తున్న నటిగా ఆలియా భట్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. దశాబ్ధం పైగా కెరీర్ జర్నీ సాగించిన ఆలియా ఇన్నేళ్లలో ఏ మేరకు ఆస్తులను కూడబెట్టింది? అంటే… జీక్యూ కథనం ప్రకారం.. ఆలియా భట్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 580 కోట్లు. భారతదేశంలోని అత్యంత సంపన్న నటీమణులలో ఆలియా ఒకరు. ఒక్కో సినిమాకి 8-15 కోట్లు పైగానే వసూలు చేస్తున్న అగ్ర కథానాయికగా ఆలియా పేరు మార్మోగుతోంది.
ఇప్పుడు రణబీర్ కపూర్ పూర్వీకులు రాజ్ కపూర్ -కృష్ణ రాజ్ కపూర్ నుండి ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనాన్ని వారసత్వంగా పొందాడు. ఈ ఇంటి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. త్వరలో అతడు తన కుటుంబంతో కలిసి రూ.350-400 కోట్ల విలువైన బంగ్లాలోకి మారనున్నట్లు హిందూస్తాన్ టైమ్స్ వెల్లడించింది.
ప్రస్తుతం రణబీర్ ముంబై బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న `వాస్తు` అనే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. వాస్తు భవనాన్ని రూ.35 కోట్లతో కొనుగోలు చేశారు. ఈ ఇంటిలోనే ఆలియాతో రణబీర్ పెళ్లి కూడా జరిగింది. అందువల్ల ఇది సెంటిమెంట్ ఇల్లు. ఇక ఆలియా- రణబీర్ కపూర్ ఆస్తులను కలిపితే వాటి విలువ సుమారు 850 కోట్ల మేర ఉంటుందని అంచనా.
హిందీ చిత్రసీమలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టాటస్ ని అందుకున్న ఆలియా భట్ కెరీర్ జర్నీ, విలాసాలు, వ్యాపారాలు, పెట్టుబడలను పరిశీలిస్తే చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఆలియాను కరణ్ జోహార్ వెండితెరకు పరిచయం చేసారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో ఆలియా కథానాయికగా తెరంగేట్రం చేసింది. 1999లో సంఘర్ష్ అనే చిత్రంతో బాలనటిగా కెరీర్ ని ప్రారంభించింది. నాటి నుంచి నేటి బ్లాక్ బస్టర్ మూవీ బ్రహ్మాస్త్ర, గంగూభాయి కథియావాడీ వరకూ ఆలియా ఎదురేలేని హవా సాగించింది. నేటితరంలో టాప్ హీరోయిన్ గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇటీవలే ఈ బ్యూటీ `హార్ట్ ఆఫ్ స్టోన్` చిత్రం(గాల్ గాడోట్)తో హాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆలియా సినిమాల్లో నటిస్తూనే రకరకాల వ్యాపారాల్లో తలమునకలుగా ఉంది. సామాజిక సేవలోను తనవంతు సహకారం అందిస్తోంది. డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి `మిసు` అనే స్వచ్ఛంద సంస్థను ఆలియా ప్రారంభించింది. తాజా సర్వే ప్రకారం.. అలియా భట్ నికర ఆస్తుల విలువ 580 కోట్లు. 69 మిలియన్ ల అమెరికన్ డాలర్లకు ఇది సమానం. ఈ నికర విలువలో ఎక్కువ భాగం సినిమాలు, ఎండార్స్‌మెంట్‌లు, ఇతర వ్యాపారాల నుండి ఆర్జిస్తున్నట్టు తెలిసింది. ఒక్కో సినిమాకి ఆలియా సుమారు 8 నుంచి 15 కోట్లు వసూలు చేస్తుంది.
అలియా ఇంతకుముందు సొంత దుస్తుల బ్రాండ్ ఎడ్-A-మమ్మా ను ప్రారంభించింది. ఈ సంస్థ రేంజ్ ఏడాది కిందటే రూ. 150 కోట్ల వ్యాపార స్థాయికి చేరుకుంది. అయితే ఈ క్రేజీ కంపెనీని ముఖేష్ అంబానీ కుమార్తె కొనుగోలు చేసిందని కథనాలొచ్చాయి. దీనికోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసారు అంబానీలు. ఇవే గాక.. ఆలియాకు `ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్` అనే ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అలియా నిర్మించిన `డార్లింగ్స్` అదే బ్యానర్‌పై తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అలాగే అలియా భట్ ఈ-కామర్స్ కంపెనీ నైకాలో కూడా వాటాలను కలిగి ఉంది. ఇందులో జూలై 2020 సంవత్సరంలో రూ. 4.95 కోట్ల పెట్టుబడి పెట్టింది. 2013లో స్థాపించిన స్టైలింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన స్టైల్‌క్రాకర్ అనే ఫ్యాషన్ స్టార్టప్‌లోను ఆలియాకు వాటా ఉంది. అలియా పర్యావరణ సహిత వ్యాపారంలోను ఉంది. పూల వ్యర్థాలను సేకరించి ధూపం ఉత్పత్తులలో రీసైకిల్ చేసే ఫూల్ డాట్ కో అనే D2C కంపెనీకి మద్దతు ఇచ్చింది. కంపెనీ యానిమల్ ఫ్రెండ్లీ. జంతువుల తోలు(లెదర్)కు ప్రత్యామ్నాయంగా `ఫ్లెదర్`ను అభివృద్ధి చేసింది.
ఇక బంగ్లాలు కార్ లు విదేశాల్లో సొంత ఇల్లు ఇవన్నీ ఆలియా లైఫ్ స్టైల్ కి అద్దంపడతాయి. లండన్ లోని అల్ట్రా రిచ్ డ్రీమ్ హోమ్ మొదలు స్వాంకీ వానిటీ వ్యాన్ వరకు అలియా భట్ ఐదు ఖరీదైన డీల్స్ చేసింది. ఆలియా కేవలం 28 సంవత్సరాల వయస్సులో లండన్ లాంటి ఖరీదైన నగరంలో సొంత ఇంటిని వోన్ చేసుకోవడం నుండి విలాసవంతమైన కార్ల కు యజమాని అయింది.
బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ భార్య గౌరీ ఖాన్ స్వయంగా అలియా కోసం వానిటీ వ్యాన్ రూపకల్పన చేశారు. ప్రసిద్ధ డిజైనర్ అలియా వానిటీ వ్యాన్ ఇంటీరియర్ కి సాయం చేశారట. ఇది కదిలే విలాసవంతమైన గృహం. ఆలియా ఫుల్ హ్యాపీగా ఉండే ముంబై అపార్ట్ మెంట్ ఎంతో విలాసవంతమైనది. ఒక అపార్ట్ మెంట్ ఉన్నా కానీ అలియా ముంబైలోని జుహులో వేరొక అందమైన అపార్ట్ మెంట్ ని కలిగి ఉన్నట్లు తెలిసింది. దీని కోసం ఆమె 13.11 కోట్ల రూపాయలను వెచ్చించింది. 2300 చదరపు అడుగుల విస్తీర్ణంలో తన సోదరితో కలిసి అపార్ట్ మెంట్ కొనుగోలు చేసారు. ఇదేగాక.. అలియాకు కూడా 2460 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ వేరొకటి ఉంది. ప్రియుడు రణబీర్ కపూర్ మాదిరిగానే 32 కోట్ల రూపాయలకు ఈ ఇంటిని కొనుగోలు చేసింది.
అలియా బ్రాండెడ్ ఖరీదైన వాహనాలను సొంతం చేసుకుంది. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ & బిఎమ్.డబ్ల్యూ 7-సిరీస్ ను కలిగి ఉన్నారు. రేంజ్ రోవర్ వోగ్ ధర 1.88 కోట్ల రూపాయలు కాగా, ..బిఎమ్ డబ్ల్యూ 7 సిరీస్ విలువ 1.37 కోట్ల రూపాయలు. చానెల్ టు లూయిస్ విట్టన్,.. అలియా ఖరీదైన బ్యాగులను సేకరించే అలవాటును కలిగి ఉంది.