ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వడం లేదు అనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపించేవి. ముఖ్యంగా చాలామంది తెలుగు హీరోయిన్స్ తెలుగులో అవకాశాలు లేక పక్క భాషల వైపు మొగ్గు చూపి అక్కడ తమ సత్తా చాటి స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు సంపాదించుకున్నారు కూడా.. అయితే ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. అందుకే కాలానికి తగ్గట్టుగా తెలుగు హీరోయిన్లు కూడా ట్రెండ్ ఫాలో అవుతూ.. తమను తాము ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య, కాకినాడ శ్రీదేవి, శివాని నాగారం ఇలా ఎంతోమంది కొత్త తెలుగు హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. మొదటి సినిమాతోనే ఊహించని పాపులారిటీ అందుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అందుకే ఇప్పుడు మన తెలుగు హీరోయిన్ల టాలెంట్ ను గుర్తించి అటు దర్శక నిర్మాతలు కూడా ఇండస్ట్రీలో వారికి అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఒక తెలుగమ్మాయి.. తెలుగులో అవకాశాలు లేక కోలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడే సత్తా చాటి స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీ అవ్వాలనే ప్రయత్నం చేస్తోంది.. ఆమె ఎవరో కాదు ఐశ్వర్య రాజేష్.
దివంగత హీరో రాజేష్ కూతురిగా, ప్రముఖ సీనియర్ నటీమణి శ్రీ లక్ష్మీ మేనకోడలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఐశ్వర్య రాజేష్.. తెలుగులో రాంబంటు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకుంది. తర్వాత కోలీవుడ్లో పలు సినిమాలు చేసిన ఈమె.. తెలుగులో రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ పోషించిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో నటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ ఇలా పలు చిత్రాలలో నటించి.. ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ భార్యగా భాగ్యం పాత్ర పోషించి, మరింత పాపులారిటీ అందుకుంది.. ఈ ఒక్క సినిమా ప్రాంతీయంగా ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఈ సినిమా సక్సెస్ తో పలు అవకాశాలు అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకో మళ్లీ అవకాశాలు తలుపు తట్టలేదు.. దీంతో పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ బిజీగా మారిన ఈమె అందులో భాగంగానే రకరకాల దుస్తులతో ఫాలోవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. నిన్న మొన్నటి వరకు సాంప్రదాయంగా చీరకట్టులో కనిపించిన ఈమె ఇప్పుడు అందాలు ఆరబోస్తూ ఫ్యాషన్ కనబరుస్తూ అభిమానులను సైతం అలరిస్తోంది.
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించిన ఐశ్వర్య రాజేష్ అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేయడంతో అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు అమ్మాయిలు కూడా ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఐశ్వర్య రాజేష్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.