ఒకప్పుడు హీరోయిన్స్ ని చూడాలి అంటే కేవలం సినిమాలలో లేదా సినిమా ఫంక్షన్లలో మాత్రమే చూసే వాళ్ళం. పైగా పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి అభిమానుల దాటికి తట్టుకోలేక పబ్లిక్ లోకి రావాలంటే కూడా భయపడేవారు. అందుకే సెలబ్రిటీలను చూడాలి అంటే చాలా కష్టంగా మారేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫారం వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకునే టెక్నాలజీ పెరిగిపోయింది.
అటు సెలబ్రిటీలు కూడా సినిమాలలో యాక్టివ్గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు. అలాగే తమకు చెందిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు కూడా.. అంతే కాదండోయ్ గ్లామర్ ఒలకబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో కూడా పడ్డారు. ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారో వారికి ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆదాయం కూడా లభిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే.. అభిమానులకు దగ్గర అవ్వడమే కాకుండా.. ఫాలోవర్స్ ను పెంచుకోవచ్చు అలాగే ఆదాయాన్ని కూడా పొందవచ్చు.
ఈ క్రమంలోనే సినిమాలకు దూరంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఆయీషా శర్మ. నిత్యం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ క్లీవేజ్ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తూ మరొకవైపు సెల్ఫీ ఫోజులతో అబ్బురపరుస్తోంది. తాజాగా వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు, అక్కడి అందాలను కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంది ఆయీషా శర్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు.
ఆయీషా శర్మ కెరియర్ విషయానికి వస్తే.. ఈమె ఎవరో కాదు ప్రముఖ నటి నేహా శర్మకు సోదరి అవుతుంది. అటు నేహా శర్మ కి కూడా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రావడం లేదని చెప్పవచ్చు. ఇక ఆయీషా శర్మ విషయానికి వస్తే. మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన ఈమె.. తొలిసారి ఆయుష్మాన్ ఖురానా ఐక్ రూపొందించిన మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఆ తర్వాత హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సత్యమేవ జయతేలో నటించింది. ఇందులో మనోజ్ బాజ్ పేయ్ ,జాన్ అబ్రహం నటించారు. ఈ ఒక్క సినిమాలోనే నటించిన ఈమె మరో వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే రెండు మూడు మ్యూజిక్ వీడియోలలో కనిపించిన ఆయీషా శర్మ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూనే ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువవుతోంది. మరి సినిమాల్లోకి రావడానికి ఆసక్తి కనబరుస్తోందా లేదా అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.
ఆయిషా శర్మ తండ్రి విషయానికి వస్తే.. ఈయన ప్రముఖ రాజకీయ నాయకుడు అజిత్ శర్మ. బీహార్ భాగల్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఆయీషా శర్మ సోదరి నేహా శర్మ విషయానికి వస్తే.. ఈమె చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.