బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో నటించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అమీషా పటేల్. పాతిక సంవత్సరాలుగా గ్లామర్ ప్రపంచంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈ అమ్మడు మరిన్ని సినిమాలతో ముందు ముందు ఆకట్టుకుంటాను అంటోంది. అయిదు పదుల వయసుకు చేరువ అయినప్పటికీ ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉన్న అమీషా పటేల్ తనకంటూ ఒక మంచి జోడీ కోసం వెతుకుతున్నట్లు చెప్పుకొచ్చింది. వయసుతో సంబంధం లేకుండా, తన వయసులో సగం ఉన్న కుర్రాడితోనూ డేటింగ్‌కి రెడీ అన్నట్లుగా అమీషా పటేల్ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికీ నా కంటే వయసులో చాలా చిన్నవారు నాపై ప్రేమను చూపిస్తూ, ప్రేమిస్తున్నాం అని చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అని తాజాగా ఒక చిట్ చాట్ లో అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
నా అభిప్రాయాలను గౌరవిస్తూ, నన్ను ఇష్టపడటం మాత్రమే కాకుండా, నాకు సంబంధించిన అన్ని బాధ్యతలు తనవిగా భావించిన వ్యక్తి ఎదురైతే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు అంటూనే మంచి వ్యక్తి తారస పడటం లేదు అంటూ అమీషా చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరం గా ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమీషా పెళ్లి గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఆమె పెళ్లి చేసుకోదు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. పెళ్లి చేసుకోవడం పట్ల ఆమెకు ఆసక్తి లేదు అనే పుకార్లు షికార్లు చేశాయి. కానీ వాటిని కొట్టిపారేస్తూ తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. అయిదు పదుల వయసులో పెళ్లి చేసుకోవడం ఏంటో అంటూ చాలా మంది ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అమీషా పటేల్ తనకంటే చాలా చిన్న కుర్రాడిని అయినా పెళ్లి చేసుకునేందుకు రెడీ అంటోంది. అయితే ఆమెతో ప్రేమ వ్యవహారం, డేటింగ్ కు అయితే కుర్రాళ్ళు ఓకే అంటారు కానీ పెళ్లికి ఓకే అనే కుర్రాళ్లు ఉంటారా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య ఒక సీనియర్ హీరోయిన్ తో కుర్ర హీరో ప్రేమాయణం అంటూ వార్తలు వచ్చాయి. వారిద్దరి మధ్య దాదాపు 15 ఏళ్ల వయసు తేడా ఉండేది. అయితే ప్రేమ వ్యవహారం కొన్నాళ్లు సాగింది, కానీ పెళ్లి మాత్రం జరగలేదు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా విడి పోయారు. వయసు తేడా కారణంగానే వారి పెళ్లి జరగలేదు అనేది చాలా మంది అభిప్రాయం. అసలు విషయం ఏంటి అనేది వాళ్లు ఇప్పటి వరకు నోరు విప్పి చెప్పలేదు. కనుక ఈ సీనియర్ హీరోయిన్ సైతం కుర్రాడితో ప్రేమలో పడితే అలాంటి పరిస్థితి ఎదురుకావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వయసులో తనకంటే చాలా చిన్నవాడి తో అయినా పెళ్లికి సిద్ధం అంటూ అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆమె ఓపెన్‌గా చేసిన ప్రకటనను అభినందిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటే, కొందరు మాత్రం ఇన్నాళ్లు పెళ్లికి దూరంగా ఉండి ఇప్పుడు కుర్రాడు అయినా ఓకే అంటూ మాట్లాడటం ఏంటో విడ్డూరంగా ఉందని అంటున్నారు. 2007 వరకు వరుస సినిమాలు చేసిన అమీషా పటేల్ ఆ తర్వాత కాస్త తగ్గించింది. ఇప్పుడు గదర్ 2 సినిమా హిట్ కావడంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లీడ్ రోల్స్ లో సినిమాలు చేసేందుకు తాను రెడీగా ఉన్నాను అంటూ ఫిల్మ్ మేకర్స్ కి అమీషా పటేల్ సిగ్నల్ ఇస్తుందట. అయితే అమీషా కోరుకున్న పాత్రలు ఆమెకు దక్కుతాయా అనేది చూడాలి. అలాగే ఆమె పెళ్లి విషయమై కాలమే సమాధానం ఇవ్వాలి.


















