ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

ఘోర ప్రమాదం.. గాలిలోనే విమానం, హెలికాప్టర్ ఢీ 67 మంది మృతి

ఘోర ప్రమాదం.. గాలిలోనే విమానం, హెలికాప్టర్ ఢీ 67 మంది మృతి
ADVERTISEMENT

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో పెను విమాన ప్రమాదం సంభవించింది. రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక ప్రయాణీకుల విమానం, హెలికాప్టర్ గాల్లోనే పరస్పరం ఢీకొన్నాయి. ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా ఢీకొని రెండూ పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఆ సమయంలో విమానం 64 మందితో వెళ్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పోటోమాక్ నదిలో రెస్క్యూ బోట్లు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. ప్రమాదం తర్వాత రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయాన్ని అత్యవసర ఆదేశం ప్రకారం మూసివేశారు.

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం, బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అధికారులు చెప్పారు. వాషింగ్టన్ డీసీలోని పొటోమాక్ నదిపై గగనతలంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం, హెలికాప్టర్ రెండూ నదిలో పడిపోయాయి. ప్రమాదానికి కారణాలు ఏంటన్నది ఇప్పటికీ తెలియలేదు.

అమెరికా ఎయిర్‌లైన్స్ విమానంలో నలుగురు సిబ్బంది సహా 64 మంది ఉన్నారు. మిలటరీ హెలికాప్టర్‌లో ముగ్గురు ఉన్నారు.

రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు దగ్గర హెలికాప్టర్, విమానాన్ని ఢీకొట్టింది.

28 మంది మృతదేహాలను గుర్తించామని అత్యవసర సర్వీసుల చీఫ్ జాన్ డొన్నెల్లీ చెప్పారు. 27 మృతదేహాలను విమానం నుంచి, ఓ మృతదేహాన్ని హెలికాప్టర్ నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు.

విపరీతమైన గాలి కారణంగా శిథిలాలు ఎయిర్ పోర్టు నుంచి విల్సన్ వంతెన వరకు కనిపిస్తున్నాయని తెలిపారు.

రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నుంచి రికార్డయిన రెండు ఆడియోలను బీబీసీ ప్రతినిధులు వెరిఫై చేశారు. 60మంది ప్రయాణికులుతో వెళుతున్న విమానానికి దూరంగా వెళ్లమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మిలటరీ హెలికాప్టర్‌కు చెబుతున్న విషయం ఓ ఆడియోలో రికార్డయింది.

వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఆడియో సమయం, ప్రమాద సమాయానికి సరిపోలింది.

ఓ ఆడియో క్లిప్‌లో ”పీఏటీ 2-5(హెలికాప్టర్ )సీఆర్‌జీ(ప్యాసెంజర్ విమానం)ఇన్ సైట్…పీఏటీ 2-5 సీఆర్‌జేకు స్పందిస్తోంది” అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెబుతున్నారు. విమానం ఇన్ సైట్. విజువల్ ప్రత్యేకంగా చూపించండి” అని హెలికాప్టర్ పైలట్ అడుగుతున్నట్టు వినిపిస్తోంది.

దాదాపు 15 సెకన్ల తర్వాత వెనక ఎవరో ”ఓ” అని అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది.

కంట్రోల్ టవర్‌లో రికార్డయిన మరో ఆడియోలో ప్రమాదానికి ముందు కొందరి మాటలు వినిపిస్తున్నాయి. ”పీఏటీ 2-5 సీఆర్‌జే ఇన్ సైట్…పీఏటీ 2-5 సీఆర్‌జే వెనకకు వెళ్తోంది” అని ఫ్లైట్ కంట్రోలర్ చెబుతున్నట్ట తెలుస్తోంది.

మొదటి క్లిప్‌లో ”ఓ” అన్న శబ్దం విన్న కాసేపటికే, దాదాపు 12 సెకన్ల తర్వాత ”టవర్ నువ్వది చూశావా” అని ఎవరో అడుగుతున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత కంట్రోల్ టీమ్ దగ్గరిలోని విమానాలను దారి మళ్లిస్తున్న మాటలు కూడా ఆడియోలో వినిపిస్తున్నాయి.

రాత్రివేళ వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉందని, పైలట్లు అనుభవమున్నవారని, అంతా బాగానే ఉందని, కానీ ఏదో జరిగిందని రవాణా సెక్రటరీ సీన్ డఫ్ఫీ చెప్పారు. ఆ ప్రాంతంలో విమానం ఉందన్న విషయం హెలికాప్టర్‌ సిబ్బందికి తెలుసన్నారు.

ఆ ప్రాంతంలో హెలికాప్టర్ ఎందుకు ఎగురుతుందనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. హెలికాప్టర్ పైకో, కిందకో, పక్కకో ఎందుకు వెళ్లలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూడా ప్రశ్నించారు.

ప్రమాదాన్ని వినాశకరమైనదిగా అమెరికా ఎయిర్ లైన్స్ సీఈవో రాబర్ట్ ఐసోమ్ చెప్పారు.

రీగన్ ఎయిర్‌పోర్టులో నైపుణ్యమున్న పైలట్ల అవసరం ఉందని కాంగ్రెస్‌ సభ్యుడు రోన్ ఎస్టేట్స్ అన్నారు.

దాదాపు 16 ఏళ్లలో అమెరికాలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదమిది.

కాన్సాస్‌లోని విచిట నుంచి విమానం బయలుదేరిందని, 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని, మిలటరీ హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని వాషింగ్టన్ డీసీ అధికారులు ప్రమాద వివరాలు తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:48 గంటలకు కంట్రోల్ టవర్ అలర్ట్ సమాచారం అందింది. వెంటనే 300 మంది సహాయ కార్యక్రమాల కోసం రంగంలోకి దిగారు.

విపరీతమైన గాలి, చీకటి, గడ్డకట్టిన వాతావరణం వల్ల సహాయ కార్యక్రమాలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఫెడరల్ ఏవియేషన్ అధికార యంత్రాంగం, రవాణా యంత్రాంగం, స్థానిక, రాష్ట్ర యంత్రాంగం అంతా కలిసికట్టుగా సహాయ కార్యక్రమాల ఆపరేషన్ నిర్వహిస్తోందని అమెరికా రవాణా విభాగం సెక్రటరీ సీన్ డఫీ చెప్పారు.

విమాన శిథిలాల సేకరణకు సమయం పడుతుందని వాషింగ్టన్ డీసీ ఫైర్, ఈఎంఎస్ చీఫ్ జాన్ డానెల్లీ చెప్పారు.

విచిట నుంచి విమానం బయలుదేరేటప్పుడు అంతా మామూలుగానే ఉందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జెస్సీ రోమో చెప్పారు.

పొటొమాక్ నది దగ్గరగా ఉన్న ఎయిర్‌పోర్టు దక్షిణ ప్రాంతం అలెగ్జాండ్రియా, వర్జీనియా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం హెలికాప్టర్ల ధ్వని మార్మోగుతోంది.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Thandel: తండేల్ సెన్సార్ టాక్

Next Post

డీప్‌సీక్ ఎలా పనిచేస్తోందో తెలుసా..?

Related Posts

YouTuber
Crime

YouTuber:హైదరాబాద్‌లో యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం

CyberCrime
Crime

CyberCrime:పోలీసులు హెచ్చరించినా వినకుండా రూ.49 లక్షలు కోల్పోయిన రిటైర్డ్ ఉద్యోగి

Meta
Crime

Meta: 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ‘నా అన్వేషణ’ ఇన్‌స్టా అకౌంట్ డిలీట్

SurrogacyCase
Big Story

SurrogacyCase:డాక్టర్ నమ్రత, కుమారుడు జయంత్ కృష్ణ అరెస్ట్ — హవాలా లావాదేవీలు, శిశు విక్రయాలపై ఈడీ సంచలన దర్యాప్తు

APNews
Crime

APNews:విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం – ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలి ఎనస్థీషియా పీజీ వైద్య విద్యార్థిని దీపిక మృతి

PhoneTappingCase
Crime

PhoneTappingCase: కీలక పరిణామం – ప్రణీత్ రావు డీఎస్పీ హోదా రద్దు, ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగింపు

Next Post
డీప్‌సీక్ ఎలా పనిచేస్తోందో తెలుసా..?

డీప్‌సీక్ ఎలా పనిచేస్తోందో తెలుసా..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PoojaHegde

PoojaHegde:ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న పూజా హెగ్డే ఎరుపు అవతారం

Keralam

Keralam:కేరళ నుంచి ‘‘కేరళం’గా మార్పు: కేంద్ర కేబినెట్ ఆమోదం, స్థానిక భాషా మూలాలకు గౌరవం

GHMC

GHMC:హైదరాబాద్‌లో దోమల పెరుగుదలకు జీహెచ్ఎంసీ ఫాగింగ్ స్కాం కారణమా? డీజిల్ దుర్వినియోగం బహిర్గతం

YouTuber

YouTuber:హైదరాబాద్‌లో యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం

Recent News

PoojaHegde

PoojaHegde:ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న పూజా హెగ్డే ఎరుపు అవతారం

Keralam

Keralam:కేరళ నుంచి ‘‘కేరళం’గా మార్పు: కేంద్ర కేబినెట్ ఆమోదం, స్థానిక భాషా మూలాలకు గౌరవం

GHMC

GHMC:హైదరాబాద్‌లో దోమల పెరుగుదలకు జీహెచ్ఎంసీ ఫాగింగ్ స్కాం కారణమా? డీజిల్ దుర్వినియోగం బహిర్గతం

YouTuber

YouTuber:హైదరాబాద్‌లో యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info