అభినయ పరిచయం అవసరం లేని పేరు, సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న అభినయ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. రవితేజ హీరోగా వచ్చిన నేనింతే చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన అభినయ అనంతరం కింగ్, సంగమం, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, జీనియస్ తదితర చిత్రాల్లో చిన్నా చితకా పాత్రల్లో నటించారు.ఇక మహేష్ బాబు వెంకటేష్ హీరోలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వారికి చెల్లెలు పాత్రలో నటించి అభినయ మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. పుట్టుకతోనే చెవుడు మూగా అయినప్పటికీ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నటిగా తనని తాను నిరూపించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న ఈమె హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నారనీ గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తూ తాను ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని కానీ తన చిన్ననాటి స్నేహితులతో గత 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాను అంటూ తన ప్రేమ విషయాన్ని చెప్పడమే కాకుండా కొద్ది రోజులకే నిశ్చితార్థం జరిగింది అంటూ నిశ్చితార్థపు ఫోటోలను షేర్ చేశారు. ఇక ఇటీవల తనకు కాబోయే భర్త కార్తీక్ ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా నిశ్చితార్థం జరుపుకున్న అభినయ తాజాగా పెళ్లి పీటలు ఎక్కారని తెలుస్తుంది. వీరి వివాహం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వాహం జరిగింది. ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక ఈనెల 20వ తేదీ హైదరాబాదులోనే గ్రాండ్ గా రిసెప్షన్ కూడా జరగబోతుంది. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారని సమాచారం ప్రస్తుతం ఈమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.