‘RX 100’, ‘మహాసముద్రం’ లాంటి ఇంటెన్స్, రా సినిమాలు తీయడంలో దర్శకుడు అజయ్ భూపతిది ప్రత్యేక శైలి. ఆయన ఇప్పుడు తన నాలుగో సినిమా AB4 కోసం ప్లాన్ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ కొద్ది వారాల క్రితమే ప్రకటించినా, అసలు సస్పెన్స్ మాత్రం హీరో, హీరోయిన్ల గురించే నడిచింది. ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ, టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న ఇద్దరు క్రేజీ స్టార్ కిడ్స్‌ను మేకర్స్ అధికారికంగా పరిచయం చేశారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ సెన్సేషన్ రషా థడానీని స్వాగతిస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈమె 90ల నాటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్, ప్రముఖ నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీల కుమార్తె. ఇప్పటికే ‘ఆజాద్’ అనే హిందీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రషా, ఉయ్ అమ్మా పాటతో సోషల్ మీడియాను షేక్ చేసింది. విడుదల చేసిన పోస్టర్‌లో రషా ఒక బైక్‌పై చాలా స్టైలిష్, రగ్డ్ లుక్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న హీరోది కూడా ఇండస్ట్రీలో చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, దివంగత రమేష్ బాబు గారి కుమారుడు అయిన జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఇలా ఘట్టమనేని మూడో తరం వారసుడు, రవీనా టాండన్ కూతురు కలిసి నటిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు అతిపెద్ద హైలైట్‌గా నిలిచింది.
దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తన మార్క్ స్టైల్‌లో ప్లాన్ చేశారు. ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరి అని కొండల నడుమ చాలా సహజంగా సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. ముఖ్యంగా, తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలను చాలా బలంగా రాసుకునే అజయ్ భూపతి, ఈ సినిమాలో కూడా రషా థడానీ కోసం ఒక పవర్‌ఫుల్, ఇంటెన్స్ రోల్‌ను సిద్ధం చేశారని సమాచారం.
ఈ భారీ డెబ్యూ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్‌లోని ఇద్దరు దిగ్గజ నిర్మాతల అండ దొరికింది. లెజెండరీ ప్రొడ్యూసర్ సి. అశ్విని దత్ (వైజయంతీ మూవీస్) ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, ‘చందమామ కథలు’ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్ చూస్తుంటే, ఇది డెబ్యూ సినిమా అయినా నిర్మాణ విలువలు ఏమాత్రం తగ్గకుండా భారీగా ఉండనున్నాయి.
ఈ కొత్తతరం ప్రేమకథ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. సినిమా అసలు టైటిల్‌ను, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఇక స్టార్ కిడ్స్, స్టార్ డైరెక్టర్, స్టార్ ప్రొడ్యూసర్స్ కలయికలో వస్తున్న ఈ సినిమా రాబోయే అప్డేట్స్ తో ఎలాంటి హైప్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.


















