శ్రీముఖి అలియాస్ బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో బుల్లితెర మహారాణిగా పేరుపొందిన యాంకర్ సుమా రేంజ్ లో అవకాశాలు అందుకుంటూ ఇటు పలు బుల్లితెర షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే.. అటు సినిమా ఈవెంట్లలో కూడా సందడి చేస్తోంది. ముఖ్యంగా కట్టుబొట్టుతో అందరినీ ఆకట్టుకునే ఈమె.. ఇటు సాంప్రదాయంగా కనిపించడమే కాకుండా.. అటు గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ను అలరించడానికి మరో ఫోటోషూట్ తో ఫాలోవర్స్ ముందుకు వచ్చేసింది శ్రీముఖి.
తాజాగా పర్పుల్ కలర్ లెహంగా ధరించిన ఈమె ఇందులో చూడ చక్కని లుక్కులో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య శ్రీముఖిని సాంప్రదాయంగా చూసేసరికి అభిమానులు, ఫాలోవర్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. తాజాగా పర్పుల్ కలర్ లెహంగా ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో మల్టీకలర్ థ్రెడ్ తో డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించింది. ఈ ఔట్ఫిట్ ను పరిపూర్ణం చేయడం కోసం గోల్డెన్ కలర్ లేస్ తో డిజైన్ చేసిన పర్పుల్ కలర్ దుపట్టాతో అందాలను దాచేసింది. పైగా అందమైన గాజులు, చెవి దుద్దులతో పాటు ఆ నెక్ ను మరో హారంతో అందంగా తీర్చిదిద్దింది. అలా మొత్తానికైతే సింపుల్ లుక్ తో తన మేకోవర్ ను ఫినిష్ చేసిన ఈమె.. అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించిన ఈ ఔట్ఫిట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
శ్రీముఖి ప్రస్తుతం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోతో పాటు సింగింగ్ కాంపిటీషన్లో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇక మొన్నటి వరకు బిగ్ బాస్ సీజన్ 9 లోకి కామనర్స్ ను పంపించడానికి దాదాపు పది రోజులపాటు నిర్వహించిన అగ్నిపరీక్ష షో కి కూడా యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అంతేకాదు పలు సినిమా ఈవెంట్లకు, అవార్డు ఫంక్షన్లకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ వాటి సక్సెస్ కి కారణమవుతోంది శ్రీముఖి
శ్రీముఖి కెరియర్ విషయానికి వస్తే పటాస్ షో ద్వారా కెరియర్ ను ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత పలు షోలలో యాంకర్ గా అవకాశాన్ని అందుకుంది. ఈమె హోస్ట్ గానే కాకుండా హీరోయిన్గా, నటిగా కూడా పలు చిత్రాలలో నటించింది. అలా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లిగా నటించింది శ్రీముఖి. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాతో హీరోయిన్గా కూడా ప్రేక్షకులను పలకరించింది. ముఖ్యంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి, అటు తమిళ్, కన్నడలో కూడా చిత్రాలు చేసింది.. ఇకపోతే సినిమాలలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెర పైనే సెటిల్ అయ్యింది.