ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాకు పనిచేసిన వారందరికీ మంచి జోష్ ఇస్తుంది. అంతేకాదు ఆ హిట్ వల్ల నెక్స్ట్ త్వరగా అవకాశాలు వస్తాయి. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలకు ఇంకాస్త బజ్ పెరుగుతుంది. ఐతే లేటెస్ట్ గా ఒక సినిమా హిట్ తో అగ్ర నిర్మాత దిల్ రాజుకి కూడా కలిసి వచ్చేలా ఉంది. ఇంతకీ అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తమిళ్ లో సక్సెస్ అయిన లవ్ టుడే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశాడు దిల్ రాజు. ఆ సినిమా యూత్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. తెలుగులో కూడా సినిమా హిట్ అయ్యింది.
ప్రదీప్ రంగనాథ్, ఇవానా జంటగా నటించిన లవ్ టుడే తెలుగులో కూడా సక్సెస్ అవ్వడంతో వెంటనే దిల్ రాజు ఇవానాని తన నెక్స్ట్ సినిమా లో తీసుకున్నారు. తన ఇంటి వారసుడు ఆశిష్ హీరోగా తెరకెక్కిస్తున్న సెల్ఫిష్ సినిమాలో ఇవానా హీరోయిన్ గా నటించింది. విశాల్ కాశి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కథతో రాబోతుందని తెలుస్తుంది. సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగం అవుతున్నాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ఆశిష్ తో లవ్ మీ అనే సినిమా తీసి దాన్ని ముందు రిలీజ్ చేశారు. ఐతే సెల్ఫిష్ అవుట్ పుట్ పై దిల్ రాజు అంత సాటిస్ఫైడ్ గా లేరని అందుకే సినిమా రిలీజ్ ఆపారని తెలుస్తుంది. ఐతే లేటెస్ట్ గా ఇవానా శ్రీవిష్ణుతో సింగిల్ సినిమా చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. లవ్ టుడే డబ్బింగ్ సినిమా తో ఇవానా తెలుగు సక్సెస్ అందుకోగా స్ట్రైట్ గా సింగిల్ తో కూడా హిట్ అందుకుంది. సో ఇవానా హిట్ మేనియా కచ్చితంగా సెల్ఫిష్ సినిమాకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. అందుకే సెల్ఫిష్ సినిమాపై దిల్ రాజు ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆశిష్ ఈమధ్యనే మరో సినిమా మొదలు పెట్టాడు. దిల్ రాజు, శిరీష్ లు ఎలాగైనా ఆశిష్ ని హీరోగా నిలబెట్టాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. సెల్ఫిష్ నుంచి రిలీజైన సాంగ్ కూడా బాగానే క్లిక్ అయ్యింది.ఇవానా లక్ సెల్ఫిష్ టీం కు కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి.