సినీ ఇండస్ట్రీలో PR (పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్), సోషల్ మీడియా పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో సోషల్ మీడియాదే ఎక్కడైనా హవా. సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్స్ విషయంలో దానిదే కీలక పాత్ర. అదే సమయంలో పీఆర్ లేకుండా చిత్ర పరిశ్రమ మనుగడ సాధించడం కష్టమని అంతా చెబుతుంటారు.
ఇప్పుడు ఆ రెండింటిపై హీరోయిన్ రెజీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రెజీనా.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఓ కోలీవుడ్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.
ఇప్పుడు ఆ రెండింటిపై హీరోయిన్ రెజీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రెజీనా.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఓ కోలీవుడ్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.
అప్పటి నుంచి వరుసగా కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన రోల్స్ లో నటించిన రెజీనా.. ఇండస్ట్రీలోకి 20 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జర్నీ, ఎదురైన సవాళ్లు, పరిశ్రమలో నెలకొన్న వాస్తవాలు గురించి ఓపెన్ గా మాట్లాడారు. తనకు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేదని.. ఎంతో కష్టపడి ఎదిగినట్లు రెజీనా గుర్తు చేసుకున్నారు. అయితే సినిమాల్లోకి వచ్చిన మొదట్లో కేవలం సెట్ కు వెళ్లడం, సినిమాలో నటించడం, మళ్లీ ఇంటికి వచ్చేయడం.. ఇంతేనా అని ఎప్పుడూ అనుకునేదాన్ని అని చెప్పారు. పీఆర్, సోషల్ మీడియా అవసరం లేదని అనుకున్నట్లు పేర్కొన్నారు.
కేవలం తన యాక్టింగ్ చేసి ఛాన్సులు రావాలని, పబ్లిసిటీ చూసి కాదు అనుకునేదాన్ని అని చెప్పిన రెజీనా.. కొంత కాలం అయ్యాక వాటి అవసరమేంటో తెలిసి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన విషయాలు ఆడియన్స్ కు చేరువుతున్నానని రెజీనా కసాండ్రా వెల్లడించారు. అయితే కెరీర్ లో ఒక దశలో విసుగొచ్చి, 2015-16లో యాక్టింగ్ మానేయాలనుకున్నానని చెప్పిన రెజీనా.. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి కెరీర్ కు ఎండింగ్ పలకాలనుకున్నానని తెలిపారు. కానీ 2018 నుంచి మళ్లీ అవకాశాలు క్యూ కట్టాయని, అందుకే అప్పటి నుంచి భిన్నమైన పాత్రల్లో నటించడం మొదలుపెట్టానని పేర్కొన్నారు. తెలుగు రాకపోవడం వల్ల, టాలీవుడ్ లో ఇబ్బంది పడ్డానని అమ్మడు.. ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుతున్నానని తెలిపారు.