మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో కాస్త దూకుడు తగ్గించిందని చెప్పొచ్చు. ఇప్పుడా అప్పుడా దాదాపు రెండు దశాబ్దాలుగా తమన్నా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది. శ్రీతో తెరగేట్రం చేసి ఆ తర్వాత మళ్లీ హ్యాపీడేస్ తో రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలతో అదరగొట్టేస్తూ వచ్చింది. యువ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరినీ కవర్ చేసింది తమన్నా. ఇప్పటికీ ఆమె తన సూపర్ ఫాం కొనసాగిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల్లో కూడా తమన్నా హవా కొనసాగింది.
ఐతే టాలీవుడ్ లో తమన్నా హీరోయిన్ గా చేస్తూనే స్పెషల్ సాంగ్స్ తో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ఒకానొక దశలో స్పెషల్ సాంగ్ అంటే ఇంకెందుకు తమన్నా ఉంది కదా కానిచ్చేద్దాం అన్న రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. ఐతే తమన్నా స్పెషల్ సాంగ్ చేసి ప్రత్యేకంగా తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ చేసి చాలా రోజులైంది. అందుకే ఆమె స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అది కూడా తమన్నాని సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే ఒక డైరెక్టర్ తన సినిమాలో ఈ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు హిట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ ఒకటి ప్లానింగ్ ఉందని టాక్. అనిల్ రావిపూడి చేసిన ఎఫ్2, ఎఫ్3 సినిమాల్లో తమన్నా నటించింది. తనకు ఆమె హిట్ సెంటిమెంట్ గా భావిస్తున్నాడు అనిల్ రావిపూడి. అందుకే ఆమెను మన శంకర వరప్రసాద్ లో అలా స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసే ఏర్పాటు చేస్తున్నారట.
అనిల్ రావిపూడి ఆడియన్స్ పల్స్ బాగా పట్టేశాడు. తను తీసే సినిమాల్లో కథ అంత గొప్పగా లేకపోయినా టికెట్ కొన్న ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ పక్కా అందిస్తాడు. తమన్నా స్పెషల్ సాంగ్ కూడా మళ్లీ ఆమె కంబ్యాక్ కి ఉపయోగపడేలా చేయడమే కాకుండా చిరుతో స్పెషల్ సాంగ్ అంటే ఉండే రేంజ్ మరోసారి చూపించబోతున్నాడట. తమన్నా కాకపోతే చిరుతో స్పెషల్ సాంగ్ అంటే ఏ స్టార్ హీరోయిన్ అయినా ఓకే అనేస్తుంది కదా అంటే.. మరి అనిల్ ప్లాన్ ఎలా ఉందో కానీ ఈ సాంగ్ గురించి జస్ట్ ఇలా అప్డేట్ వచ్చిందో లేదో సాంగ్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అనేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాకు భీంస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో నయతార హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ గా వచ్చిన మీసాల పిల్ల సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.


















