ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవదేవుడు ఏడు కొండల వాడు కొలువు ఉంటే తిరుమల తిరుపతిలో అంతా పవిత్రంగా ఉంటుంది. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు విశ్వాసాలు అన్నీ తిరుమలతోనే ముడి పడి ఉన్నాయి. అందుకే తిరుమలలో జరిగే ఏ కార్యక్రమం అయినా మొత్తం పారదర్శకంగా ఉండాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. తిరుమల దేవాలయం ప్రపంచంలో అతి పెద్ద ప్రార్ధానామందిరం. హిందువులకు ఆరాధ్యనీయ మైన ప్రదేశం అని పవన్ అభివర్ణించారు. అందువల్ల తిరుమల వ్యవహారాలను చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఎక్కువ బాధ్యత ఉందని ఆయన అన్నారు.
తిరుమలలో జరిగే ఆర్థిక వ్యవహారలు అంతే కాదు ఆర్ధిక విషయాలకు సమంధించిన నివేదికలు, ప్రసాదాల విషయంలో పాటు ఇతర విషయాల్లో పాటించే నాణ్యతా ప్రమాణాలు అలాగే ఆడిట్ వంటివాటితో పాటు ఆస్తులు విరాళాల నిర్వహణ వరకూ అన్నీ కార్యక్రమాలు కూడా పూర్తి పారదర్శకంగా ఉండాలని పవన్ కోరారు ఏ వివరణ అయినా బహిరంగానే ఉండాలని అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొంటూ అలా చేయాలని టీటీడీని తాను కోరుతున్నాను అని చెప్పుకొచ్చారు.
ఇక తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకాల మూలంగా అనేక ఇబ్బందులు తలెత్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. లడ్డూ విషయంలో కూడా నాణ్యత సరిగ్గా పాటించలేదని అన్నారు. టీటీడీ బోర్డు కూడా దుర్వినియోగానికి గురి అయింది అని అన్నారు. అందుకే టీటీడీ కొత్త విధానాల దిశగా సాగాలని ఆయన కోరారు. గతంలో జరిగిన తప్పులు భక్తులకు తీరని గాయాలని మిగిల్చాయని ఆయన అన్నారు. గతంలో జరిగిన చర్యలు విశ్వాస ద్రోహానికి ఒక గుణపాఠంగా ఉన్నాయని వాటి నుంచి పాఠాలు నేర్వాలని ఆయన సూచించారు.
దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయని వాటి ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ జరగాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని అంటున్నారు ధర్మాన్ని పరిరక్షించడం దాని కోసం నిలబడటం ప్రతి ఒక్క సనాతన ధర్మ విశ్వాసం చూసేవారికి ఒక సమిష్టి బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనైనా దేశవ్యాప్తంగా ఉన్న మన దేవాలయాలన్నీ సమాజం ద్వారా వారి సమిష్టి బాధ్యత ద్వారా నిర్వహించబడతాయన్నది తన హృదయపూర్వకమైన ఆశగా ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద తిరుమల గురించి పవన్ ఒకే రోజున తన భావాలను ఆధ్యత్మికతను భావోద్వేగాలను పంచుకోవడం అది అతి పెద్ద చర్చకు దారి తీస్తోంది.


















