అసలే మాయా ప్రపంచం.. ఏది నిజమో, మరేది అబద్ధమో తెలుసుకోవడం పెద్ద టాస్క్ గా మారిన పరిస్థితి.. దీనికి తోడు ఇప్పుడు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ మాయా ప్రపంచాన్ని మరింత మాయగా మార్చేస్తోంది. ఏఐ క్రియేట్ చేసిన వీడియోల్లో ఏది నిజం.. ఏది మాయ.. అనేది తెలుసుకోవడానికి నిపుణులు పెద్ద పెద్ద ఆన్ లైన్ యుద్ధాలే చేయాల్సిన పరిస్థితి!
ఈ లోపు దానికి సంబంధించిన వీడియో ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తోంది. అవునా.. అది నిజమా.. అని జనం కామెంట్లు పెట్టి, ఆశ్చర్యపోతున్నారు. ఆనాక.. ఫ్యాక్ట్ చెక్ టీం రంగంలోకి దిగుతున్నారు. ఆ వీడియో నిజం కాదని.. అది పూర్తి ఏఐ సృష్టించిన మాయ అని క్లారిటీ ఇస్తున్నారు. అప్పుడు కానీ అసలు విషయం తెలియడం లేదు. ఈ లోపు ప్రతీ నెలా ఏప్రిల్ ఫూల్ జరుగుతూనే ఉంది.
అవును… తనదైన క్రియేటివిటీతో ఏఐ వీడియోలు నెటిజన్లు నెలతో సంబంధం లేకుండా రెగ్యులర్ గా ఏప్రిల్ ఫూల్స్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తి పులికి మద్యం తాగిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో భాగంగా.. మధ్యప్రదేశ్ లోని పెంచ్ కు చెందిన రాజు పటేల్ అనే వ్యక్తి పులిని ముద్దు చేసి, దానికి మద్యం తాగిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
ఆ వైరల్ పోస్ట్ లో రాజు అనే 52 ఏళ్ల కార్మికుడు రాత్రిపూట మద్యం సేవించిన తర్వాత పులిని ఏదో పెంపుడు జంతువుగా భావించాడని పేర్కొన్నారు. ఆ వీడియో ఎంత వాస్తవంగా కనిపించిందంటే.. అది పెంచ్ నుండి వచ్చిన నిజమైన సీసీటీవి క్లిప్ అని చాలామంది నమ్మారు. అయితే ఫ్యాక్ట్ చెక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కానీ దాని అసలు గుట్టు రట్టు కాలేదు.
ఇందులో భాగంగా… ఈ వీడియో క్లిప్ ఏఐ ద్వారా సృష్టించబడిందని.. నిజమైన సంఘటన కాదని నిర్ధారించారు. వాస్తానికి.. పెంచ్ నిజమైన పులుల వీక్షణలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఏ విశ్వసనీయ మీడియా సంస్థ లేదా స్థానిక అటవీ శాఖ అటువంటి సంఘటనను నివేదించలేదు. అయినప్పటికీ… దీనికి సంబంధించిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా స్పందించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి, వన్యప్రాణి నిపుణుడు పర్వీన్ కశ్వాన్.. నెటిజన్లు ఇలాంటి ఏఐ – జనరేటెడ్ వీడియోలకు దూరంగా ఉండాలని కోరారు.. వాటిని ఫార్వార్డ్ చేయవద్దని.. అనవసరమైన భయాందోళనలను సృష్టించవద్దని ఆయన కోరారు!
కాగా.. ఏఐ జనరెటెడ్ వీడియోలు ఇటీవల కాలంలో తీవ్ర వివాదాస్పదమవుతోన్న సంగతి తెలిసిందే. వీటి భారిన ఇప్పటికే పలూరు సినీ నటులు, ప్రముఖ క్రీడాకారులు పడ్డారు! వీటిలో కొన్ని వీడియోలు అసభ్యకరంగా ఉండగా.. మరికొన్ని వీడియోలు ఆన్ లైన్ గేమ్స్, జూదాలకు ప్రముఖులు ప్రచారం చేస్తున్నట్లుగా ఉండి, తీవ్ర కలకం సృష్టించాయి.
On October 4, 2025, in Pench, India, a surreal moment was captured on CCTV. The photo shows Raju Patel, a 52-year-old laborer, patting a tiger he mistook for a "big cat" after a late-night card game. Tipsy from homemade liquor, Raju stumbled onto a street where a sub-adult Bengal… pic.twitter.com/FXbZsGeawy
— Constituent 🇺🇸🌺🐦🕊️ 🕉️ (@808constituent) October 23, 2025


















