Budget 2025-26: వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్ లో పతనమవుతున్న ఆర్థక వృద్ధి రేటు, అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం, వినియోగ డిమాండ్ లో పెరుగుదల వంటి పలు సవాళ్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిష్కరించాల్సి ఉంటుంది. వీటిలోపాటు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో నిర్మలమ్మ ముందున్న సవాళ్లే ఏంటో చూద్దాం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టనున్నారు, అయితే ఈసారి కొన్ని పెద్ద ప్రకటనలు చేయవచ్చు అని ప్రజలు భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌పై పన్ను చెల్లింపుదారులు కూడా భారీ అంచనాలతో ఉన్నారు. అధిక ద్రవ్యోల్బణం ఇంకా వినియోగం దృష్ట్యా పన్ను చెల్లింపుదారులు పన్ను రేట్లలో కోత అలాగే మినహాయింపుల పరిమితి పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. 2025 బడ్జెట్‌లో హెచ్‌ఆర్‌ఏ, సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు అండ్ రూ.1 లక్ష స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
యూనియన్ బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టారు, ఇది పన్ను అవస్థాపనను సులభతరం చేసే లక్ష్యంతో ఉంది. అయితే ఇందులో ఎలాంటి సడలింపు ఇవ్వలేదు. స్టాండర్డ్ తగ్గింపు మాత్రమే అందుబాటులో ఉంది. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ఇచ్చింది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు ఉండగా, దాన్ని రూ.లక్షకు పెంచవచ్చు. కాగా పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలు. దీన్ని కూడా రూ.1 లక్షకు పెంచవచ్చు.
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద పన్ను చెల్లింపుదారులకు రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఇవ్వబడుతుంది. చాలా కాలంగా మారని దాని పరిమితిని పెంచాలనే డిమాండ్ ఇప్పుడు ఉంది. అలాగే దీనిని 2 లక్షలకు పెంచాలన్న డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఇన్వెస్టర్లు PPF, LIC, PF అండ్ హోమ్ లోన్ వంటి ప్రదేశాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా రాయితీని పొందవచ్చు.
ప్రజలు సెక్షన్ 80EE కింద హోమ్ లోన్ ప్రైమరీ మొత్తానికి చేసిన చెల్లింపులపై మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అర్హులు. హోమ్ లోన్ వడ్డీ చెల్లింపులకు తగ్గింపు ఆర్థిక సంవత్సరానికి రూ. 50,000 వరకు ఉంటుంది. అయితే దీన్ని కూడా బడ్జెట్‌లో పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
కొత్త పన్ను విధానంలో HRA మినహాయింపును చేర్చాలనేది పన్ను చెల్లింపుదారుల సాధారణ డిమాండ్. ప్రస్తుతం ఈ ప్రయోజనం పాత పన్ను విధానంలో మాత్రమే వర్తిస్తుంది, ఇది పన్ను ఆదాకు దారి తీస్తుంది. ఈ మినహాయింపును చేర్చడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.