ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాజకీయాల్లో అపరచాణక్యుడుగా అభివర్ణిస్తారు. అంతేకాదు మంచి అడ్మినిస్ట్రేటర్‌గా కూడా చెప్పుకుంటూ ఉంటారు.ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో వెల్ అడ్మినిస్ట్రేటర్‌గా రాజకీయంలో అపర చాణక్యుడిగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే దాని అంతుచూసే వరకు వదిలిపెట్టరు అనేది అందరికీ తెలిసిందే. రెవెన్యూలోటుతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఇందుకు దేశ,విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.ఇందులో భాగంగా విశాఖ వేదికగా సీఐఐ సదస్సు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.ఒకవైపు సీఐఐ సదస్సు ప్రారంభం రోజునే బీహార్‌తోపాటు పలు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నప్పటికీ ప్రపంచం మెుత్తం ఏపీవైపు చూస్తోంది. ముఖ్యంగా విశాఖ వైపు చూస్తోంది అంటే సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఏంటో అర్థం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్‌గా మంచి గుర్తింపు ఉంది.పాతికేళ్ళకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు 45 ఇయర్స్ ఇండస్ట్రీ పూర్తి చేసుకున్నారు.అందుకే చంద్రబాబునాయుడును రాజకీయ అపర చాణక్యుడు అంటారు. అయన చూడని ఎత్తులు లేవు, ఆయనకి ఎదురైన అవరోధాలు లేవు…అన్ని తట్టుకుని ముందుకు సాగరు, సాగుతూనే ఉన్నారు. అంతే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఏకంగా జాతీయ రాజకీయాల్లోకూడా చక్రంతిప్పుతున్నారు చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో పోలిటీషియన్‌లే ఉంటారు కానీ చంద్రబాబు నాయుడును ప్రజలు అడ్మినిస్ట్రేటర్‌గా గుర్తిస్తారంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయి.రాష్ట్రానికి ITని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన హైటెక్ CM చంద్రబాబు నాయుడేనని ఇప్పటికీ చెప్తూ ఉంటారు.
1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి పదవీకాలంలో ఎక్కువ భాగం హైదరాబాద్‌ను ఐటీ గమ్యస్థానంగా అభివృద్ధి చేయడం మరియు మార్కెటింగ్ చేయడంపై దృష్టి సారించారు. బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ లాంటి దేశాధినేతల మనసును సైతం చంద్రబాబు నాయుడు గెలుచుకున్నారు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తులను హైదరాబాద్ తీసుకువచ్చి భారీ సదస్సులను నిర్వహించారు. అలా సైబరాబాద్ నిర్మాణంలో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలా అనేక కార్పొరేట్ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించడంలో కీలకంగా మారిన సంగతి తెలిసిందే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో నవ్యాంధ్రప్రదేశ్ పూర్తిగా ఆర్థికంగా వెనుకబడింది. ఇప్పటికీ రెవెన్యూ లోటుతో సతమతమవుతుంది.విభజనతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి 2014 నుంచి చంద్రబాబు నాయడు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించడానికి శ్రమిస్తున్నారు. ఇప్పటికీ దేశ విదేశాలలో తనయుడు నారా లోకేశ్ ఒకవైపు… ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరోవైపు పర్యటించారు. విదేశాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించి తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అభివృది రూపు రేఖలను మార్చేసిన సీఎం చంద్రబాబు నాయుడు సంస్కరణలు అంటే ఏంటో దేశానికి చెప్పి గవర్నమెంట్ అంటే ఎలా పని చెయ్యాలో చేసి చూపించారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.ప్రస్తుతం నవ్యాంధ్రకి పెద్ద దిక్కుగా మారారు. పెట్టుబడిదారులకు ఒక అయస్కాంతంగా మారారు.రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా విశాఖ వేదికగా సీఐఐ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ రెండు రోజుల సదస్సులో రూ.10 లక్షల కోట్ల ఎంవోయూలు జరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అంతేకాదు సదస్సులో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు త్వరగా పరిశ్రమలను స్థాపించేందుకు సహకరించేలా ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ ఎస్కార్ట్ వ్యవస్థ పెట్టుబడులు పెట్టిన కంపెనీలు త్వరితగతిన తమ కార్యకలాపాలు సాగించేలా అందుకు అనుమతులు మంజూరు చేయించడంలో కీలకంగా వ్యవహరించనుంది.ఈ సీఐఐ సదస్సు సక్సెస్ అయి అనుకున్న టార్గెట్ రీచ్ అయి పెట్టుబడులు వస్తే సీఎం చంద్రబాబు నాయుడు పేరు మరోసారి చరిత్రలో నిలిచిపోనుంది.
గతంలో ఏపీలో ఐటీని ప్రోత్సహించామని, గూగుల్, ఆడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలు భారతీయులే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆర్ధిక సంస్కరణల తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయన్నారు.
జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉందన్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భారత్ క్వాంటం మిషన్ ప్రారంభించిందని పేర్కొన్నారు. దానిని అందిపుచ్చుకుని తొలి క్వాంటం వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే డ్రోన్లు కూడా పెద్దఎత్తున వినియోగంలోకి తెస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. సివిల్ అప్లికేషన్లు, డిఫెన్సు రంగాల్లో వీటి తయారీ పెరగాలని, అందుకే ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. స్పేస్ అప్లికేషన్లు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయని, అందుకే స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరిగిందని, సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో బలంగా ఉన్నామని గుర్తుచేసారు. అలాగే పోర్టు రవాణా రంగంలో ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నట్లు వివరించారు.
రైల్వే నెట్ వర్క్ కూడా పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశంలోని వివిధ నగరాల్ని అనుసంధానం చేస్తోందని సీఎం తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నామన్నారు. కేవలం 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. గూగుల్ కూడా రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతోందన్నారు. వారికి కూడా చాలా కొద్ది రోజుల్లోనే అనుమతులిచ్చామన్నారు.
ప్రోత్సాహకాలు, వేగంగా అనుమతులు ఇవ్వటంలో ఏపీకి పోటీ లేదని చంద్రబాబు గుర్తుచేశారు. పెట్టుబడులతో ముందుకు వస్తే చాలు ఎస్కార్ట్ ఆఫీసర్‌ను నియమించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సహకరిస్తామన్నారు. ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే గా ఉంటుందన్నారు. ఏపీలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యం, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి సాటి లేదన్నారు. వీటిని ఉపయోగించుకోవాలని యూరోప్ దేశాల్లోని పారిశ్రామిక వేత్తలను కోరారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా మారుతుందని, అందులో ఏపీ ముందుంటుందని తెలిపారు.


















