భిన్నవిభిన్నమైన దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే పనిగా పెట్టుకున్న అతి కొద్దిమంది హీరోయిన్స్ అటు ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. ఒకవైపు హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే మరొకవైపు ఇలా ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి గ్లామర్ తో కట్టిపడేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో బ్యూటీ కూడా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె ఎవరో కాదు అమైరా దస్తూర్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో అభిమానులను అలరిస్తోంది. అంతేకాదు మేని ఛాయతో.. సొగసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే తాజాగా రెడ్ కలర్ శారీలో దర్శనం ఇచ్చిన అమైరా.. తన సోయగాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. ముఖ్యంగా సింపుల్ ప్లెయిన్ శారీ ధరించిన ఈమె దీనికి అటాచ్డ్ హెవీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఆకట్టుకుంది. ఒకరకంగా ఇది బాటమ్ నుంచి చూస్తే చీరను తలపిస్తూ.. ఫ్రంట్ నుండి చూస్తే మోడ్రన్ డ్రెస్ ను తలపిస్తూ ఉండడం గమనార్హం . అలా ట్రెండీ దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఫాలోవర్స్ స్పందిస్తూ.. ఫైర్, హార్ట్, స్మైలీ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన అమైరా దస్తూర్.. 2013లో వచ్చిన హిందీ చిత్రం ఇసాక్ ద్వారా తన నటన జీవితాన్ని మొదలుపెట్టింది.. సినీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్తలోనే తన నటనతో అందరినీ అబ్బురపరిచిన ఈ చిన్నది.. హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. 2018లో విడుదలైన ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. 2018 ఫిబ్రవరి 16న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల చేత పరవాలేదు అనిపించుకుంది. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటించగా.. అమైరా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.మొదటి సినిమాతోనే అలరించడంతో ఇక రాజుగాడు సినిమాలో కూడా అవకాశం లభించింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా చేసి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది.
అలా ఆ తర్వాత హిందీ, తమిళ్ చిత్రాలలో నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది. కానీ ఈ మధ్య సినిమాలలో నటించకుండా ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తోంది.


















