సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పుష్ప 2: ది రూల్ మూవీ ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ చేస్తూ రీలోడెడ్ వెర్షన్.. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30వ తేదీన అంటే బుధవారం అర్ధరాత్రి నుంచే పుష్ప రాజ్ ఓటీటీ హవా మొదలైందనే చెప్పాలి.
తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది పుష్ప-2. అంతేకాదు, సంక్రాంతి తర్వాత థియేటర్‌లో విడుదల చేసిన రీలోడెడ్ వెర్షన్ కన్నా ఎక్స్ ట్రా సీన్స్ తో ఓటీటీ వెర్షన్ ఉంది. ఈ విషయంలో మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మొత్తం 3.44 గంటల నిడివితో విడుదలైంది ఓటీటీ వెర్షన్.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ గురువారం ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ రిలీజైంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ వెర్షన్స్ మాత్రమే విడుదలయ్యాయి. కన్నడ వెర్షన్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
థియేటర్లలో పోలిస్తే ఓటీటీలో పుష్ప రన్‌టైమ్ 23 నిమిషాలు పెరిగింది. లెంగ్త్ ఎక్కువనే కారణంగా ఎడిటింగ్‌లో కట్ చేసిన పలు సీన్స్‌ను ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేశారు. థియేటర్లలో ఈ మూవీ మూడు గంటల ఇరవై నిమిషాల రన్‌టైమ్‌తో రిలీజైంది. ఓటీటీలో మాత్రం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల లెంగ్త్‌తో పుష్ప 2ను రిలీజ్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కొత్తగా ఓటీటీలో యాడ్ చేసిన సీన్లు ఎవన్నది ఓటీటీ ఫ్యాన్స్‌లో ఆసక్తికరంగా మారింది.
అల్లు అర్జున్ ఎలివేషన్ సీన్లతో పాటు బుక్కారెడ్డి క్యారెక్టర్‌కు సంబంధించిన ట్విస్ట్, జపాన్ ఫైట్ సీక్వెన్స్‌లకు సంబంధించిన సన్నివేశాలు ఓటీటీ వెర్షన్‌లో కొత్తగా కనిపించాయి.
సిండికేట్ మీటింగ్‌కు పుష్పరాజ్ అటెండ్ అయ్యే సీన్ ఓటీటీలో కనిపించింది. ఈ సీన్‌లో అల్లు అర్జున్ డైలాగ్స్ మాసీగా, పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. . ఇది నేను ఎర్ర చొక్కా అంటే అందరూ నమ్మాలి అంటూ సిండికేట్ మెంబర్స్‌కు అల్లు అర్జున్ వార్నింగ్ ఇచ్చినట్లుగా చూపించారు.
పుష్ప 2 మూవీలో ఆరంభంలో వచ్చే జపాన్ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో అభిమానులను ఆకట్టుకుంది. కానీ అల్లు అర్జున్ జపాన్ ఎందుకు వచ్చాడు? కంటైనర్‌లో నలభై రోజులు తిండి లేకుండా ఎలా ఉన్నాడన్నది థియేటర్లలో చూపించలేదు. జపాన్ ఫైట్ వెనకున్న కారణాల్ని వివరిస్తూ కొన్ని సీన్స్‌ను ఓటీటీలో యాడ్ చేశారు. థియేటర్‌తో పోలిస్తే ఓటీటీలో ఈ ఫైట్ సీన్ లెంగ్త్ పెరిగింది. ట్రైలర్‌లో కనిపించిన జపాన్ రెస్టారెంట్ సీన్ కూడా ఓటీటీలో కనిపించింది.
రామేశ్వరం ఎపిసోడ్ పుష్ప 2కు హైలైట్‌గా నిలిచింది. ఆ సీన్‌కు కొనసాగింపుగా ఓ ఛేజ్ ఎపిసోడ్‌ను ఓటీటీలో యాడ్ చేశారు. ఈ ఛేంజిగ్‌లో బుక్కారెడ్డి చనిపోయినట్లుగా చూపించారు.
బుక్కారెడ్డి చనిపోయిన తర్వాత జాలీ రెడ్డిని పుష్ఫరాజ్ కలవడం, ఓ సోఫాను బహుమతిగా ఇచ్చి సిండికేట్‌లో కలవమని అడిగే సీన్ థియేటర్లలో కనిపించలేదు. ఓటీటీలో ఆ సీన్‌ను సినిమాకు కలిపారు.
పుష్పరాజ్ ఫ్యామిలీ బాండింగ్‌కు సంబంధించి థియేటర్లలో మిస్సయిన పలు సీన్లు ఓటీటీలో కనిపించాయి.
పుష్పరాజ్ ఇంటికి అతడి అన్నయ్య వచ్చే ఎపిసోడ్‌లో కొన్ని కొత్త సీన్లు యాడ్ చేశారు. అజయ్ కూతురి పెళ్లికి వచ్చిన పుష్పరాజ్‌ను అన్నలిద్దరూ కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యే సీన్ ఓటీటీలో చేర్చారు. అలాగే పుష్పరాజ్ నుంచి లాక్కున్న చైన్‌ను అతడి మెడలో అజయ్ స్వయంగా వేసే సీన్ థియేటర్లలో లేదు. ఓటీటీలో మాత్రం కనిపించింది.